
ఆంధ్ర కేశరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలను మెంటాడ మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ అసిస్టెంట్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం పంతులు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని యువతకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని పంతులుగారికి ఘనంగా నివాళులర్పించారు.