A2Z सभी खबर सभी जिले की

ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…

గురజాడ కళాభారతి ఆడిటోరియంలో శనివారం ప్రబోధా సేవా సమితి..ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు హాజరయ్యారు ..సమితి అధ్యక్షుడు వి. శంకరరావుతో కలిసి శ్రీకృష్ణుడు ప్రతిమకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ సృష్టి అంతటికీ ఏకైక దేవాది దేవుడు శ్రీ కృష్ణుడు అని అన్నారు.. శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరణ జ్ఞానంగా చేయాలన్నారు. సమితి అధ్యక్షుడు వి.శంకరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు.. ఈ నెల 20వ తేదీ బుధవారం స్వామి వారి ప్రతిమతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి విజయనగరం పుర వీధుల్లో ఊరేగింపు ఉంటుందన్నారు.. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వారికి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించారు.. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పిసిఆర్ కేసలి అప్పారావు, ఉత్తరాంధ్ర బీసీ నాయకులు ముద్దాడ మధు, గదుల సత్యాలత, సమితి ప్రతినిధులు నాయుడు, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు..

Back to top button
error: Content is protected !!