
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కాంప్లెక్స్ వద్ద రక్షాబంధన్ వేడుక నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సమీరా మాట్లాడుతూ ప్రతి ఏడాది సమయానికి రక్షాబంధన్ తారీకు వస్తుంది కానీ గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగే రోజు మాత్రం రావడం లేదని విమర్శించారు, పాలకవర్గాలు 75 ఏళ్లుగా స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నాం అని చెప్తూనే ఉన్నారు కానీ వారు తీసుకొచ్చిన దిశ నిర్భయ వంటి చట్టాలు కాగితాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని దుయ్యబట్టారు. దేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక అమ్మాయి అత్యాచారానికి గురవుతోందని ఈ కేసుల్లో ముద్దాయిలుగా అత్యధిక శాతం రాజకీయ నాయకులు అధికారులే ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రధానంగా ఈ రక్షాబంధన్ వేడుకల ద్వారా మేము ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాం దేశం మొత్తాన్ని కుదిపేసిన ధర్మస్థల అంశం ప్రజలందరికీ తెలిసిందే దాదాపుగా 400 మంది అమ్మాయిలు వారి శరీరాలు నగ్నంగా కర్ణాటకలోని ధర్మస్థల వద్ద అనేక చోట్ల పాతి పెట్టడం జరిగింది,వీటిని సిట్ అధికారుల సమక్షంలో వెతికి తీస్తున్నారు ఎంతటి ఘోరాతి ఘోరమైన ఘటన జరిగితే గౌరవ ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనకు పోతారు దీనిని పరిరక్షించాల్సిన గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలే తన ఉద్యోగం అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు తక్షణమే ధర్మస్థలి అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని అత్యాచారానికి గురై పాతి పెట్టబడిన 400 మందికి పైగా మహిళల ఆచూకీ కనుగొని వారిని ఎంతటి దారుణ స్థితికి తీసుకువచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రజల్లో సోదరా భావాన్ని పెంపొందించుకునేలా ఆడబిడ్డలకు అండగా నిలవాలని దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పోలీసు వారికి మీడియా మిత్రులకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వ్. చిన్నబాబు, జ్.రవి కుమార్ ,పి రమేష్ ,జిల్లా సహాయ కార్యదర్శి కే రాజు నాయకులు యర్రమ్మ రాహుల్ తదితరులు పాల్గొన్నారు,
