
నాటు తుపాకుల ఏరివేత, గంజాయి, నాటు సారా నియంత్రణే లక్ష్యంగా ఏజన్సీ ప్రాంతాల్లోని ముందుగా గుర్తించిన గిరిజన గ్రామాల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషను నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,
ఐపిఎస్ ఆగస్టు 7న ఆదేశించారు. నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్సు లేకుండా తుపాకుల వినియోగించడం
చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గ్రామస్థులకు అర్ధమయ్యే రీతిలో వివరించి, అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – ఏజన్సీ ప్రాంతాల్లో అడవి పందుల నుండి పంటలను
రక్షించుకొనేందుకు మరియు అడవి పందులను వేటాడేందుకు కొంతమంది నాటు తుపాకులను అనధికారంగా
వినియోగిస్తున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో నాటు తుపాకులు వినియోగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలన్నారు. ఇందుకు గ్రామ స్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని, మహిళా సంరక్షణ పోలీసులు మరియు దత్తత గ్రామాల పోలీసు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో గుర్తించిన గ్రామాల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సందర్శనలు చేసే సమయంలో నాటు తుపాకులు కలిగి ఉండడం ఇండియన్ ఆర్మ్స్ యాక్టు ప్రకారం తీవ్రమైన నేరం పరిగణించడం జరుగుతుందన్న
విషయాన్ని గిరిజనులు, గ్రామస్ధులకు అర్ధమయ్యే రీతిలో తెలపాలన్నారు. ఎవరి వద్దనైనా నాటు తుపాకీ ఉన్నట్లయితే స్వచ్ఛందంగా అప్పగించాలన్నారు. ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ లో ఎవరి వద్దనైనా నాటు తుపాకులు పట్టుబడితే
వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేసి, చట్టరీత్యా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులను ఆదేశించారు.
ఈ ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషనుకు నిర్వహించే ముందు ఆపరేషను యొక్క ముఖ్య ఉద్ధేశ్యాన్ని, ఆపరేషనులో
పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి వారు నిర్వర్తించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయా గ్రామాల్లోని ప్రజలతో వ్యవహరించాల్సిన తీరును గురించి ముందుగా వివరించి, దిశా నిర్ధేశం చేయాలన్నారు. సోదాల్లో ఏమైనా గంజాయి, నాటుసారా, నాటు తుపాకులు లభ్యమైతే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు
చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీగారు నిర్వహించిన టెలి కాన్ఫరెన్సులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ
ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యారెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.