A2Z सभी खबर सभी जिले की

*ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల పి. ఎఫ్ బకాయిలు చెల్లించాలి.*

 

*సమస్యల పరిష్కారం కోసం అడిగిన కార్మికుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్.ఎం.ఓ, పి.ఆర్.ఓ లను సస్పెండ్ చేయాలి.

*తొలగించిన సూపర్వైజింగ్ కాంట్రాక్టు వర్కర్లను ముగ్గురిని కొనసాగించాలి.*

Related Articles

*ఆసుపత్రుల్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు, చేర్పింపుల్లో ఎమ్మెల్యేల జోక్యం విడ్డూరం.*

*APMCEWU రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుగత అశోక్ డిమాండ్.*

జనం న్యూస్ 08 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలొ పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న హాస్పిటల్ ఆర్.ఎం.ఓ, పి.ఆర్.ఓ లు కాంట్రాక్టర్లు చేత పెరిగిన జీతాలు, పిఎఫ్ బకాయి డబ్బులు, ఈ.ఎస్.ఐ కార్డులు ఇప్పించలేదు, హాస్పిటల్ లో తీవ్రమైన పని ఒత్తిడి వలన వర్కర్లు ఇబ్బందులతో అనారోగ్యం పాలపుతున్నా వర్కర్ల సంఖ్య పెంచడం లేదు ఇలాంటి అనేక సమస్యలతో నరక యాతన అనుభవిస్తూ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఓర్చుకుని పనులు చేస్తున్న వర్కర్ల న్యాయమైన పరిష్కారం చేయమని అడిగితే మాకు సంబంధం లేదు అని అంటూ వర్కర్లను విపరీతమైన ఒత్తిడి గురిచేస్తు, అడిగిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఆర్.ఎం.ఓ, పి.ఆర్.ఓ ల సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుగత అశోక్ డిమాండ్ చేశారు.
గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం ) ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ కుమార్ నేతృత్వంలో మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ హాస్పిటల్స్ లో ఉన్న పేషేంట్లకి ఇబ్బంది కలగకుండా, ప్రాణాలు లెక్కచేయకుండా పనులు చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు జీవితాలను ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న కాంట్రాక్ట్ దళారీ వ్యవస్థ చేతుల్లో పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి కూడా యధాతధంగా ఉందని విమర్శించారు. ఆసుపత్రుల్లో గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన ఉద్యోగాలను నేడు అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు కూడా హాస్పిటల్స్ లలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగింపుల్లో జోక్యం చేసుకోవడం చాలా బాధాకరం అని అన్నారు. ప్రజాప్రతినిధులు నిరుద్యోగంలో ఉన్నవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి చూపించాల్సింది పోయి రాజకీయ పార్టీల ముద్రలు వేసి ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారిని తొలగించి వారి స్థానంలో కొత్తవాళ్ళని నియమించడం అనేది ఒకరి పొట్ట కొట్టి మరొకరి పొట్ట కొట్టడమే అవుతుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే వరకు దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని బుగత అశోక్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు ఇ. వి. నాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సింహాద్రి దుర్గారావు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అలజంగి కుమారమ్మ, నాయకులు మజ్జి చంద్ర మౌళి, సంచాన శంకర్రావు మరియు ఆసుపత్రిల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Check Also
Close
Back to top button
error: Content is protected !!