A2Z सभी खबर सभी जिले की

మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 50వ డివిజన్ వైసీపీ కి చెందిన 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక

 

*ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై అవనాపు విక్రమ్, భావన గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన 50వ డివిజన్ వైసీపీ నాయకులు*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌ.శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు, ఆకర్షితులైన విజయనగరం నియోజకవర్గం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 50వ డివిజన్ వైసీపీ కి చెందిన 200 కుటుంబాలు గురువారం జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, శ్రీమతి డా.అవనాపు భావన వారికి కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం పట్టణంలో బాలాజీ నగర్ లో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఈ చేరికలు జరిగాయి. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 50వ డివిజన్ వైసీపీ నాయకులు గోక విజయ్ కుమార్, వైసీపీ 50వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ మద్దిల నారాయణరావు నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి.
కార్యక్రమంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. నీతి నిజాయితీ, విలువలు కలిగిన రాజకీయం చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరమని విక్రమ్ గారు అన్నారు. అటవీ శాఖ మంత్రిగా ఏజెన్సీ అభివృద్ధి, ఏనుగుల సమస్యలకు పరిష్కారంపై దృష్టి సారించడం పవన్ కళ్యాణ్ గారి సేవా భావానికి తార్కాణం అన్నారు. జనసేన పార్టీలో ఇటీవల జరిగిన చేరికల్లో 50వ డివిజన్ ప్రత్యేకం అన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జన సైనికులంతా ఒక కుటుంబంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. శ్రీమతి అవనాపు భావన గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు మహోన్నత శక్తి అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరి శిఖర గ్రామాలను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పించడం, అడవి ఏనుగుల నుంచి రక్షించడమే కాకుండా గిరిజనుల కష్టాలను చూసి పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారని అన్నారు. గిరిజనులకు రగ్గులు, చెప్పులు పంపిణీ చేయడం, వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సియ్యదుల దుర్గమ్మ, వైసీపీ నాయకులు పోతుబార్కి సంతోష్ కుమార్, గంటి ఈశ్వరరావు, ముని ప్రవీణ్, రోంగలి చిట్టిబాబు, రోంగలి ఎల్లాజీ, రోంగలి ప్రసాద్, దీపిల్లి విజయ్ కుమార్, వెలగాడ రాంబాబు, బుసరి అచ్చిబాబు, బాతు నాగరాజు, బాతు సంతోష్, బోనేల ఉష, పెందుర్తి గోపి, మహిళలు, యువత, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గం జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Related Articles
Back to top button
error: Content is protected !!