
*విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న MSME పార్క్ వలన చుట్టుప్రక్కల పర్యావరణంలో ఏర్పడే కాలుష్యం వలన ఎన్నో ఏళ్ళ తరబడి స్థానికంగా నివాసం ఉంటున్న గిరిజన ప్రజల ఆరోగ్యం, వారి జీవనాధారమైన పాడిపంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది కాబట్టి స్థానిక గిరిజనులు చేస్తున్న న్యాయ పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) మద్దతు ఇస్తుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్సులు కామ్రేడ్ బుగత అశోక్, కామ్రేడ్ అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బాయి రమణమ్మ, కామ్రేడ్ ఖండేపల్లి భీముడు, కామ్రేడ్ పురం అప్పారావు లు కొట్టక్కి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు.*
*ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాలు, పర్యావరణం, పాడి పంటలు పరిరక్షణతో కూడిన సమగ్ర అభివృద్ధికి భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) కోరుకుటుందని వారు తెలిపారు.*