
విజయనగరం,బుధవారం, జులై 30 :
సేవా కార్యక్రమాల్లో భాగంగా దత్తసాయి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో “స్వచ్ భారత్” కార్యక్రమాన్ని బుధవారం ఉదయం కొత్తపేట వాటర్ ట్యాంక్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ లో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా క్లబ్ సభ్యులంతా నడక మైదానంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని అంతా ఏరివేసి, మొక్కలు,పిచ్చిమొక్కలను, తొలగించి శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా దత్తసాయి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శేష శైలజ మాట్లాడుతూ సేవాకార్యక్రమాల్లో భాగంగా స్వచ్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టామని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తామని అన్నారు.