
ఎస్ కోట మండలం వినాయక పల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలుచూరి అప్పారావు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అతన్ని ఎస్.కోటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ KGHకు తరలించారు. అతను చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.