
పెందుర్తి : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర సంఘ వ్యవస్థాపకులు ఏలూరు వెంకట రమణమూర్తి (రాజేష్ శర్మ)కు తెలంగాణ మదర్ తెరిసా అసోసియేషన్ ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డును ప్రధానం చేసింది. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు ఆడిటోరియం లో జరిగిన ఓ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రముఖులు ఆదివారం వెంకటరమణమూర్తి శర్మతో పాటు అతని కుటుంబ సభ్యులకు ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డుతో పాటు ఆయనకు ప్రత్యేకంగా గురు ముఖంగా పురోహిత అర్చక బ్రహ్మ మెడల్ తో సత్కరించి విరాట బ్రహ్మ పురస్కారాన్ని, అవార్డును అందజేసారు. ఈ మేరకు రాజేష్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రావడానికి అన్ని విధాల ప్రోత్సహించిన మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధు వర్గానికి ఆయన ధన్యవాదాలు తెలియ జేశారు. ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రముఖంగా వ్యవహస్తున్న సహచరులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు రాజేష్ శర్మ వెల్లడించారు.