
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదమజ్జి సత్యనారాయణ,
యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి. భానుమూర్తి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు.
74వ ఆవిర్భావ దినోత్సవాన్ని కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ
కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి. రవికుమార్. డిపో కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి సిహెచ్ పి పట్నాయక్, ఎఐటియుసి నాయకులు రంగరాజు , జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్యదర్శి ఏ అశోక్ తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.