
మెంటాడ, న్యూస్) రాష్ట్రవ్యాప్తంగా మండలాల వారీగా ప్రభుత్వ ఎయిడెఢ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా ఈనెల 10వ తేదీన ప్రతి పాఠశాలలోనూ మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ శివాజీ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తారీఖున జరుగు ఈ మీటింగ్ కు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారణ కొరకు పాఠశాలల అభివృద్ధి కొరకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కొరకు సలహాలు సూచనలు అవసరమని, పూర్వ విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ విద్యా కమిటీ సభ్యులు ,దాతలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.