
మెంటాడ, న్యూస్) ప్రజల కష్టాలను ప్రజల కష్టాలను కల్లారా చూసి ప్రజలతో మమేకమై ప్రజాసేవయే పరమార్ధముగా ప్రజల పట్ల అంకిత భావంతో ప్రజాధరణ పొందిన గొప్ప నాయకుడిగా వైఎస్ఆర్ పేరుందినాడని ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా మండలంలోని పిట్టాడ జంక్షన్ వద్ద గల వైయస్సార్ విగ్రహంనికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల కష్టాలను కడ తేర్చి ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకుని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రేపటి తరాల ఉన్నతి కోసం ఆహర్నిశలు కష్టపడి మంచి బాటను స్థిరపరిచిన మహోన్నతుడని ఆయనను కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108,104, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రియంబర్స్మెంట్, జల యజ్ఞం, రైతు ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్య, త్రిబుల్ ఐటీ , పేదరికానీ రూపుమాపే మహా ప్రయత్నం చేశారని ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చిన గొప్ప నాయకుడని, ప్రజల సుఖసంతోషాలే ముఖ్యమని భావించిన మనసున్న నాయకుడని ఆయన చేసిన పాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి రాజప్పలనాయుడు, కనిమెరక త్రినాథ్, సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, పొట్నూరు శ్రీను, సతీష్, కార్యకర్తలు, అభిమాను లు తదితరులు పాల్గొన్నారు.