విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులు స్వీకరించారు. ముఖ్యంగా స్పీసీ రహదారులు, కాలువలు, గృహనిర్మాణం, స్పీడ్ బ్రేకర్స్ నిర్మించాలని వినతులు వచ్చాయి. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు పంపించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.