A2Z सभी खबर सभी जिले की

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి ఎర్రబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

నేడు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న
ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు చేపట్టారు.రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి. భానుమూర్తి మాట్లాడుతూ
ఏపీలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సస్పెన్షన్లు, తొలగింపు లేకుండా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, వెంటనే పదోన్నతులు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారానే కొనాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సిబ్బంది తోనే.నిర్వహించాలి. పెండింగ్ డి ఎ బకాయిలు చెల్లించాలి,11వ పి ఆర్ సి 24 నెలల బకాయిలను ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలి డిమాండ్ చేశారు,ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐ ఆర్ ను వెంటనే ప్రకటించాలి,అదేవిధంగా 12వ పి ఆర్ సి కమీషన్ వెంటనే నియమించాలి, రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీ, టెర్మినల్ ఎన్ క్యాష్ మెంట్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భధ్రత కల్పించాలి, ఉద్యోగులను ఆప్కాస్ లో చేర్చాలి డిమాండ్ చేశారు.అదేవిధంగా మహిళ ఉచిత ప్రయాణంతో ఆర్టీసీగా అనేక ఇబ్బందులు తలెత్తునున్నాయి,మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం సక్సెస్ కావాలంటే వెంటనే కాలం చెల్లిని బస్సులు స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలన్నారు. డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి సిహెచ్ పి పట్నాయక్, డివిఆర్ఎస్ నారాయణ , కె. వి రమణ , పి శ్రీను జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షులు ఏ. అశోక్ , తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!