A2Z सभी खबर सभी जिले की

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్స్ రిలీజ్ చేసిన మంత్రి కొండపల్లి

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు క్రీడల్లో కల్పిస్తున్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన పారా “స్పోర్ట్స్ చైతన్య యాత్ర” రెండవ రోజు విజయనగరం చేరుకుంది. ఈ సందర్బంగా రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైతన్య యాత్రకు సంభందించిన పోస్టర్స్ ను శనివారం నాడు తన క్యాంపు కార్యాలయలో మీడియాకు విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉందని అన్నారు. ఇటీవల తీసుకువచ్చిన జి. ఓ. నంబర్ 4 ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల నియామాకాల్లో 3 శాతం ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండానే వారి విద్యార్హతను బట్టి పారా క్రీడలు ఆడే దివ్యాంగులకు కల్పించడం అద్భుతమైన అవకాశమని అన్నారు. అంతేకాకుండా పారా ఒలింపిక్స్, పారా ఆసియన్ గేమ్స్ లో పతకాలు సాధించే పారా క్రీడాకారులకు కోట్లాది రూపాయిలు ప్రోత్సాహం అందజేస్తున్నామని అన్నారు. అలాగే విశాఖపట్నంలో 22 ఎకరాల్లో పారా క్రీడాకారుల కోసం అత్యాధునిక స్టేడియం నిర్మించబోతున్నామని అన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రములో వున్న దివ్యాంగులంతా పారా క్రీడలు ఆడేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో జరిగే ఈ కార్యక్రమానికి రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు తోడ్పాటు అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్. ఎం. వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి. రామస్వామి, విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్, విశాఖపట్నం గౌరవ అధ్యక్షులు డాక్టర్. షీతల్ మదాన్, పారా నేషనల్ స్విమ్మర్ రవి కుమార్, పారా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ శివగంగా తదితరులు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!