
ఆర్టీసీ ఔట్సోర్సింగ్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్ర
ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఎ.పి.యస్.ఆర్.టి.సి. అవుట్సోర్సింగ్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ సెక్రెటరీ ఏ అశోక్ మాట్లాడుతూ, ఆర్టీసీ కాంట్రాక్టు 7300 మంది కార్మికులు కాంట్రాక్ట్ వ్యవస్థ థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్నాం, థర్డ్ పార్టీ విధానం వల్ల చాలా నష్టపోతున్నాం. ఆర్టీసీలో థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆర్టీసీలో పనిచేసిన అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా అవకాశం కల్పించి
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. .ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గండిపిల్లి మహేంద్ర బాబు, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, రఘు , ఈశ్వరరావు నర్సియమ్మ తదితరులు పాల్గొన్నారు.