
జిల్లాలో బాల కార్మికులు పని చేయకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. జూన్ 2 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాల కార్మికుల పునరావాసం కోసం ప్రత్యేక డ్రైన్ నిర్వహించనునట్లు తెలిపారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా, డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సభ్యులు జిల్లా అంతటా ఒకే సమయంలో దాడులు చేయాలని సూచించారు.