A2Z सभी खबर सभी जिले की

*భారత్ దాడికి నా కుటుంబంలో 10మంది చనిపోయారు: ‘ఉగ్రవాది’ మసూద్ అజర్ ప్రకటన*

పాకిస్తాన్‌లో బుధవారం తెల్లవారుజామున భారత్ జరిపిన దాడులలో తన కుటుంబానికి చెందిన పదిమంది కుటుంబసభ్యులు చనిపోయినట్టు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మౌలానా మసూద్ అజర్‌ తెలిపారు.
మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మొహమ్మద్ (జేఈఎం) విడుదల చేసిన ప్రకటనలో చనిపోయినవారిలో మసూద్ పెద్ద అక్క, ఆమె భర్త, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నట్టు తెలిపింది.
ఈ దాడిలో మసూద్ సన్నిహితులు ముగ్గురు చనిపోయారనీ, వారిలో మసూద్ సన్నిహితులకు చెందిన ఒకరి తల్లి కూడా ఉన్నట్టు జైషే మొహమ్మద్ గ్రూపు తెలిపింది.

Show More
Back to top button