
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతిని పురస్కరించుకొని, జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో
పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్ఫాలు సమర్పించి, శ్రద్ధాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – భారతదేశానికి స్వాతంత్ర్యం కేవలం సాయుధ
పోరాటంతోనే సిద్ధిస్తుందని విశ్వసించి, స్వాతంత్ర్య సాధన కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పందాను ఎన్నుకున్నారన్నారు. మన్యంలో బ్రిటీషు వారి దోపిడీని ఎదుర్కొని, గిరిజనులకు అండగా నిలిచి, వారిని ఎంతగానో చైతన్యపర్చారన్నారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని
ఆయన ఢీ కొన్నారన్నారు. భారతదేశానికికి స్వాతంత్ర్యం సాధించేందుకు, బ్రిటీషు వారితో అలుపెరగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు చివరకు చిన్న వయస్సులోనే బ్రిటీషువారి తూటాలకు 1924సంవత్సరం మే 7న నేల కొరిగాడన్నారు. అల్లూరి సీతారామ రాజు నేడు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చూపిన
తెగువ, పట్టుదల మనందరికి ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.
అనంతరం,
అల్లూరి చిత్ర పటానికి జిల్లా అదనపు పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు పూల మాలలు వేసి, పుష్పాలు సమర్పించి, మౌనం పాటించి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనవు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిపిఓ ఎఓ
పి.శ్రీనివాసరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, డిసిఆర్బీ సిఐ బి.సుధాకర్, ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, కార్యాలయ పర్యవేక్షకులు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి, పలువురు ఆర్.ఎస్.ఐలు, సిబ్బంది, పోలీసు కార్యాలయ
ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అల్లూరి సీతారామ రాజు చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి, శ్రద్ధాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు.