
నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలన్ని ట్రేడ్ లైసెన్సులు నెలాఖరులోగా రెన్యువల్ చేసుకోవాలని విజయనగరం కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో సచివాలయ శానిటరీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. రె్టారెంట్లు, నర్సింగ్ హోంలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, కళ్యాణ మండపాలు, అన్నివ్యాపార సంస్థలు లైసెన్సులు లేకుండా నిర్వహించరాదన్నారు