
విజయనగరం పట్టణం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో “లైంగిక వేధింపులు మరియు మహిళల భద్రతపై” విద్యార్ధులకు మరియు విశ్వవిద్యాలయం అధ్యావకులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంను సెప్టెంబర్ 17న విశ్వవిద్యాలయం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ పి. సౌమ్యలత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్ గారు అదనపు ఎస్పీ పి. సౌమ్య లత గారికి పుష్ప గుచ్చంతో స్వాగతం పలికి మరియు మేమెంటు బహుకరించారు. అనంతరం సరస్వతి దేవి చిత్రపటా నికి పూలమాల వేసి నమస్కరించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత మాట్లాడుతూ – ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజ రయినందుకు చాల ఆనందగా ఉందని అన్నారు. మహిళలు మరియు బాలికల భద్రతే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. మహిళల మొబైల్ ఫోనులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందని, ఒక కుటుంబ సభ్యుడు మీకు తోడు ఉన్నట్లేనన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ ను ప్రెస్ చేసినట్లయితే క్షణాల్లో పోలీసు బృందం మీరున్న ప్రాంతానికి చేరుకొని, రక్షణగా నిలుస్తారన్నారు. మహిళ ల భద్రతకు ఈ యాప్లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్ ఉందని, మహిళలు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల వాహనాలు, ఆటోల్లో ప్రయాణించినపుడు ఈ ఆప్షన్పై క్లిక్ చేసి, చేరుకోవాల్సిన ప్రాంతాన్ని నమోదు చేస్తే, వారు సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకొనేంత వరకు వారి ప్రయాణం పై పోలీసులు నిఘా పెడతారన్నారు. శక్తీ యాప్ యొక్క ఆవశ్యకతను తెలియచేస్తూ జిల్లా పోలీసు శాఖచే తయారుచేయబడిన రెండు వీడియోలను తెరపై ప్రదర్శించి విద్యార్థులకు చూపించారు. విద్యార్ధులు లక్ష్యంపై దృష్టి పెట్టుకొని, చదువుకోవాలని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. చదువుకొనే సమయంలో ఇతరులపట్ల ఆకర్షితులు కావద్దని, వారు చెప్పే మాయమాటలు నమ్మి, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ప్రతి ప్రైవేటు మరియు గవర్నమెంట్ ఆఫీసులు మరియు స్కూల్స్, కాలేజీలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఎర్పాటుచేసుకోవా లన్నారు. ఈ కమిటీలలో సగం మంది మహిళా ఉద్యోగులు మరియు సిబ్బంది లేదా విద్యార్థినులు వుండాలన్నారు. ఈ కమిటీ ప్రతి మూడు మాసాలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి వారు పనిచేస్తున్న చోట మహిళలు ఎటువంటి వేధిం పులకు గురికాకుండా, మహిళలు స్వేచ్చగా వారి మనోభావాలు దెబ్బ తినకుండా పనిచేసుకునే వెసులుబాటు కలపించాల న్నారు. విద్యార్ధులు, యువత చెడు మార్గాల్లో నడుస్తున్నారని గుర్తించి, వారిని సన్మార్గంలో నడిపించేందుకు ‘సంకల్పం’ కార్యక్రమంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గంజాయిని తరలించడమే కాకుండా గంజాయి వినియోగించడం కూడా నేరమేనని అన్నారు. గంజాయి, ఇతర మత్తు, మాదక ద్రవ్యాలకు విద్యార్థు లు బానిసలు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి గురించిన సమాచారం ఏదైనా తెలిస్తే డయల్ 100/112 కు లేదా 1972 కు గాని వెంటనే తెలియజేయాలని విద్యార్థులను అదనపు ఎస్పీ పి. సౌమ్యలత కోరారు. అనంతరం అదనపు ఎస్పీ పి.సౌమ్యలత సమక్షంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలో సభ్యులుగా విద్యార్థులను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు.
ఉపకులపతి ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ “మహిళల భద్రత, లైంగిక వేధింపుల నిరోధం ప్రతివిద్యాసంస్థలో అత్యంత ప్రధాన అంశం. సీటీయూఏపీ ఎల్లప్పుడూ సురక్షితమైన, గౌరవప్రదమైన విద్యా వాతావరణా న్ని అందించడానికి కట్టుబడి ఉంది. ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అందరికీ అవగాహన పెంచి, స్త్రీల రక్షణకు కావలసిన చట్టపరమైన, నైతికమైన జ్ఞానాన్ని చేరువ చేసాము అన్నారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ – “సీటీయూఏపీ లో మహిళల రక్షణ, లైంగిక వేధింపులనివారణ పై నిర్వహించిన ఈ వర్క్షాప్ ఎంతో ప్రాముఖ్యత గలది. ఇది విద్యార్థులు మరియు సిబ్బందికి అవగా హన కల్పించడమే కాక, సురక్షిత వాతావరణాన్ని నిర్ధారించడానికి ప్రేరణనిచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరంగా జరగడం ద్వారా విశ్వవిద్యాలయం ఇతర సంస్థలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది” అన్నారు.
యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్ డాక్టర్ పి. శ్రీదేవి మాట్లాడుతూ మహిళల భద్రత, పనిస్థల రక్షణ కోసం కమిటీ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది అన్నారు.
చివరిగా యూనివర్సిటీ పరిపాలనాధికారి డా. ఎన్వీఎస్ సూర్యనారాయణ వోటు ఆఫ్ థాంక్స్ తెలుపుతూ ఈ వర్క్షాప్ విజయవంతం కావడానికి అందరి సహకారం కీలకం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ ఎం. సరత్ చంద్ర బాబు, లైబ్రేరియన్ డాక్టర్ శంకర్ రెడ్డి కొల్లె, విభాగాధిపతులు డాక్టర్ అనిరుధ్ కుమార్, డాక్టర్ సురేష్ బాబు, ఐసిసి మెంబర్లు డాక్టర్ దివ్య కె., డాక్టర్ ప్రామా చట్టర్జీ, డాక్టర్ కళ్యంపూడి లత, డాక్టర్ కుసుమ్ మరియు విజయనగరం 2 వ పట్టణ సిఐ టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

