A2Z सभी खबर सभी जिले की

బాల్య వివాహం ను అడ్డుకున్న అధికారులు చట్టాలను గౌరవించండి


మెంటాడ,: మండలంలో గల పిట్టాడ పంచాయతీ చీపురు వలస గ్రామానికి చెందిన పి జోగి దొర (19),సారాడవలస లోతుగెడ్డ పంచాయతీ కి చెందిన సిహెచ్ సత్యవతి (15) గిరిజన ఆచారం ప్రకారంగా వివాహం జరిగిస్తుండగా బాల్యవివాహాల నిరోధ చట్టం ప్రకారం అందిన సమాచారాన్ని బట్టి వివాహం నిలుపుదల చేసి వారికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని ఇరువురు తల్లిదండ్రులకు నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రుల సమక్షంలో జోగిదొరకు సత్యవతికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో జరుగు పరిణామాలు ఎలా ఉంటాయో వివరించారు. చట్టం నిర్దేశించిన వయసు వచ్చేవరకు వివాహం జరిపించకూడదని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ సత్యనారాయణ ఐసిడిఎస్ సూపర్వైజర్ ధనలక్ష్మి ఏ.యన్.యమ్ జయశీల ఆశ వర్కర్ అంగన్వాడి కార్యకర్తలు అధికారులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Show More
Back to top button