స్కూల్ ఆయాలు, శానిటేషన్ వర్కర్ల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకులు కోరారు. శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయాలకు, సానిటేషన్ వర్కర్లకు ప్రభుత్వం ఇస్తున్న అరకొర వేతనాలు కూడా ప్రతి నెలా చెల్లించడం లేదన్నారు. వేతనాలు సకాలంలో చెల్లించక పోవడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
0 Less than a minute


