A2Z सभी खबर सभी जिले की

వినాయక నవరాత్రి వేడుకల్లో క్రమశిక్షణ పాటించాలి

-ఆండ్ర ఎస్సై కె. సీతారాం


మెంటాడ,:  మాల్లో వినాయక ఉత్సవాల సందర్భంగా విగ్రహాల ఏర్పాటు డీజే తదితర ఆర్భాటాలకు తప్పనిసరిగా సచివాలయం ద్వారా అనుమతి తీసుకోవాలని ఆండ్ర ఎస్సై సీతారాం అన్నారు. ప్రజలు ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రజాస్వామ్య పరిమితులు చట్టబద్ధ నియమాలు తప్పకుండా పాటించాలన్నారు. విగ్రహ స్థాపన శోభాయాత్రలు డీజే వాడకం వంటి అంశాలపై సచివాలయానికి దరఖాస్తు చేసి అక్కడి నుంచి పోలీస్ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని ఎస్సై స్పష్టం చేశారు. ఆహ్లాదకర వాతావరణం శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక నవరాత్రి వేడుకల్లో క్రమశిక్షణ పాటించడం వలన ఎటువంటి ఆందోళనకర సంఘటనలు చోటు చేసుకోవని ప్రతి ఒక్కరూ చట్టపరమైన అనుమతులు తీసుకుని ఉత్సాహాలు జరుపుకోవాలని కోరారు. ఎవరైనా చట్టాన్ని అధిగమిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు.

Check Also
Close
Back to top button
error: Content is protected !!