A2Z सभी खबर सभी जिले की

ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

*మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల

మెంటాడ : మండలం లో తహశీల్దార్ , ప్రజా పరిషత్ కార్యాలయాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అరుణ కుమారి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అరుణ కుమారి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల త్యాగాల వల్లే మనకు ఈ రోజు స్వేచ్ఛ లభించిందని, ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. అభివృద్ధి, ఐక్యత, సామాజిక సమానత్వం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని నిరంతరం మహనీయుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముందు సాగాలని కోరారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో భానుమూర్తి మాట్లాడుతూ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా వారి యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు దేశ అభివృద్ధి కొరకు కృషి చేయాలని విద్యార్థి దశలోనే దేశభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.కార్యక్రమంలో రెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాజు అప్పలనాయుడు, విశ్రాంతి ఉపాధ్యాయులు అప్పలనాయుడు ,డిప్యూటీ యం.పి.డి.ఓ విమల కుమారి , ఏ.పి.ఓ చిన్న అప్పయ్య, ఏ.ఓ గోకుల్ కృష్ణ, ప్రధానోపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!