
విజయనగరం పట్టణంలో కే.ఎల్.పురం ఆర్టీఏ కార్యాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కే.ఎల్.పురం స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌తో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ ఎస్.ఐ.నూకరాజు గాయపడిన వ్యక్తిని ఆటోలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.