
*🔸ఘనంగా తోషనివాలా 95వ జయంతిని నిర్వహించిన అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్*
అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ ఉద్యమకారులు,పాస్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు కీర్తిశేషులు జె.ఎల్. తోషినివాల్ 95వ జయంతి వేడుకలను ఆదివారం ఉదయం స్థానిక అయ్యన్నపేట చెరువు ప్రక్కనున్న మున్సిపల్ నడక మైదానంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం. ప్రభావతి తోషినివాలా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నడక మైదానంలో మొక్కలు నాటిన అనంతరం వైద్య శిభిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం. ప్రభావతి మాట్లాడుతూ సమాజంలో చేసిన సేవలు వృధా పోవని, సేవలు గుర్తింపును ఇస్తుందని, వాకర్స్ క్లబ్బులు సమాజానికి స్ఫూర్తిగా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదని,నడక సభ్యులు తమ నడకతో ఆరోగ్యం కాపాడు కుంటూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు.
తోషినివాలా క్రమశిక్షణకు మారుపేరని, వాకర్స్ క్లబ్బలు అభివృద్ధి చెందడానికి, క్లబ్బులు పెరగడానికి కృషిచేసిన మహనీయుడు తోషినివాలా అని, ఆయన్ను ప్రతీ ఒక్కరూ ఆదర్శముగా తీసుకోవాలన్నారు.
అనంతరం క్లబ్ గౌరవ అధ్యక్షులు పిన్నింటి సూర్యనారాయణ, డాక్టర్ ఎ. ఎస్ ప్రకాశరావు మాష్టారు, వాకర్స్ ఇంటర్నేషనల్ చీఫ్ కో ఆర్డినేటర్ జి. కృష్ణం రాజు, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కె. ఎర్నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం. ప్రభావతి ను ఘనంగా సత్కరించారు.
చివరిగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు మూడు నెలల పాటు నిర్వహించిన మజ్జిగ చలివేంద్రానికి సేవలందించిన చందక ప్రసాద్ ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి చేతులమీదుగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు నాగలక్ష్మి, శ్రీ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ, ప్రగతి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాసరావు,రామసాయి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు కొల్లి సత్యం మాష్టారు, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ పెద్దలు పిడుగు సతీష్,లాలిశెట్టి రవితేజ, లోపింటి కళ్యాణ్,చిట్టి రాజు తదితరులు భారీగా సభ్యులు పాల్గొన్నారు.