
మెంటాడ,: న్యూస్: మధ్యాహ్నం భోజనం పథకం పాఠశాలల ఆయాల సంఘం సమ్మెకు అనుమతి కోరుతూ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు నెలకు 26 వేల జీతం ఇవ్వాలన్న కనీస వేతనం అమలు చేయడం లేదని, ఎం డి ఎం కార్మికులకు మూడు నెలల నుండి జీతాలు బకాయిలు చెల్లించలేదని, ప్రతి విద్యార్థికి మెనూ 20 రూపాయలు పెంచాలని, రెండు జతల బట్టలు ఇవ్వాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు కు అనుగుణంగా జీతాలు మెనూ చార్జీలు పెంచాలని, ఆయాలకు సంరక్షణ పరికరాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 9వ తేదీన జరుగు అఖిల భారత సమ్మెలో పాల్గొంటామని అందుకు అనుమతి ఇవ్వాలని ఎం డి ఎం మండల సంఘం ప్రతినిధులు మండల రవణమ్మ, లంక దుర్గ, వరలక్ష్మి మండల విద్యాశాఖ కార్యాలయం ఎల్.డి.ఏ(నాని )కాంతారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీకే ఆర్.ఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, మండల కార్యదర్శి పి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.