
మెంటాడ: న్యూస్: మండలంలో పిట్టాడ గ్రామానికి చెందిన రెల్ల ఎర్రబాబు యొక్క మేకల మందలోని ఏడు మేకలను గ్రామ సింహాలు దాడి చేసి చంపేశాయి. మరొకటి తీవ్రంగా గాయపడగా సుమారు 1,50,000 నష్టం వాటిలినట్లు అంచనా వేశారు. ఈ మేకల పెంపకం ద్వారా జీవనోపాధి సాగిస్తున్నామని ఎంతో ఇష్టంగా పెంచుకున్న మేకల పై కుక్కలు దాడి చేయడం చాలా బాధ వేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ప్రతి గ్రామంలోనూ కుక్కల సంతతి పెరిగిపోయిందని కుక్కల ద్వారా అనేక అనర్ధాలు జరుగుతున్నాయని ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు వెంట వెంటబడి ఇబ్బందులు గురిచేస్తున్నాయని రాత్రులు ఒకరుగా వెళ్ళాలి అంటేనే ఎంతో భయంగా ఉంటుందని మండలంలోని అన్ని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టకపోతే పశువులనే కాకుండా మనుషుల పైన కూడా దాడులు చేసి గాయపరిచే అవకాశాలు ఉన్నాయని తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.