A2Z सभी खबर सभी जिले की

ఇద్దరు తమిళనాడు దొంగలు అరెస్ట్

జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల రూములే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతూ సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లను దొంగలిస్తున్న ఇద్దరు తమిళనాడు దొంగలను 2వ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వరుస ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీటీ అగ్రహరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న మురుగన్ వెంకటస్వామి, గణేషన్లను అదుపులోకి తీసుకున్నారు. 5 ల్యాప్ టాప్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Show More
Back to top button