A2Z सभी खबर सभी जिले की

పంట మార్పిడితోనే అధిక దిగుబడులు

మెంటాడ: : వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి పంట మార్పిడితోనే సాధ్యపడుతుందని ఏరువాక కేంద్రం ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త లక్ష్మణ్ అన్నారు.
ఏరువాక కేంద్రం విజయనగరం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నాడు మెంటాడ మండలం పెదచామాలాపల్లి గ్రామంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా రైతు పండించే పంటల్లో సరైన మార్పులు తీసుకు వచ్చినట్లయితే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని డాక్టర్ లక్ష్మణ్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా మన పెద చామలాపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కువమంది రైతులు సరైన సమయంలో నాట్లు వేయకపోవడం వలన దిగుబడులు తగ్గుతున్నాయని అన్నారు. అందుకొరకు రైతులు పంటలు ఎద జల్లే పద్ధతులను వేసుకోవడం వలన ఖర్చు తగ్గించి అధిక దిగుబడి సాధించవచ్చునని అన్నారు. అంతేకాకుండా ఎద జల్లిన మూడు రోజులు లోపల రైతులు పిటాక్లోర్ అనే మందును ఎకరాకు 60 మిల్లీగ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చు కలుపు నివారించుకోవచ్చు అని తెలియజేశారు.మీరు మరింత వ్యవసాయ సమాచార కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 సంప్రదించగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మరియు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు తిరుమలరావు, సురేష్ పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!