A2Z सभी खबर सभी जिले की

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ చర్యల్లో భాగంగా విజయనగరంలోని సంతకాల వంతెన వద్ద జీబ్రా గీతలు వేయించే ఏర్పాట్లను నగరపాలక సంస్థ శనివారం చేపట్టింది. కమిషనర్‌ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ఇంజినీరింగ్‌ సిబ్బంది జీబ్రా గీతలు వేయించే ప్రక్రియలను పరిశీలించారు. సిగ్నల్‌ లైట్లు వేసే సమయంలో వాహన చోదకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుకు తగిన సూచికలను ఏర్పాటు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

Show More
Back to top button
error: Content is protected !!