A2Z सभी खबर सभी जिले की

యోగాతోనే మానసిక పరిపక్వత

–ఎంపీడీవో ఏ.బానుమూర్త

 

మెంటాడ : యోగాతో మానసిక పరిపక్వత రావడమే కాకుండా శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎంపీడీవో భానుమూర్తి అన్నారు. జూన్ 21 యోగా దినోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం మెంటాడ సచివాలయం కార్యదర్శి కృష్ణధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి సినిమా హాల్ జంక్షన్ వరకు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజు కొంత సమయాన్ని యోగాను తప్పనిసరిగా కేటాయించాలన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా శరీరం యాక్టివ్‌గా ఉండడమే కాకుండా ఫిట్‌గా తయారవుతుందన్నారు.అనంతరం తాసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగా మానసిక ఆరోగ్యానికి, శరీర ధృడత్వానికి ఎంతో సహాయ పడుతుందని, ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, తరచుగా పొట్ట సమస్యతో ఇబ్బందులు పడే వారు తప్పకుండా యోగాసనాలు వేయాలన్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషి ఆరోగ్యం అత్యంత కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి హోమియోపతి డాక్టర్ శ్రీనివాస్ రావు డాక్టర్ రెడ్డి చైతన్య నాయుడు యం.ఇ.ఓ_2 శివాజీ వర్మ , సీనియర్ అసిస్టంట్ శర్మ , వెలుగు సీసీలు వీఆర్వోలు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు,ఆశ వర్కర్లు అంగన్వాడి సిబ్బంది టిడిపి పార్టీ నాయకులు రెడ్డి రాజగోపాల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!