A2Z सभी खबर सभी जिले की

యాక్సిడెంట్‌లో యువకుడి మృతి

విజయనగరంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కొండకరకాంకు చెందిన ప్రమోద్‌ కుమార్‌, చిన్నారావు సునీల్‌ బైక్‌పై విజయనగరం నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో RTO ఆఫీస్‌ సమీపంలో బొలెరో వాహనాన్ని వీరి బైక్‌ బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108లో స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ చిన్నారావు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.   

Back to top button
error: Content is protected !!