
చెబుతున్నారు. అయితే, రేషన్ డీలర్లను తలదన్నేలా ఎండీయు నిర్వాహకులు క ూడా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయన్న నెపంతో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను రద్దు చేసి రేషన్ సరుకులు పంపిణీని జూన్ 1 నుంచి మళ్లీ డీలర్లకు అప్పగిస్తోన్న పరిస్థితి. ఇంతవరకు బాగానే ఉన్నా, దీంతో డీలర్ల పరిస్థితి విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్న చందంగా తయారైందంటున్నారు. ఆదాయం లేక.. రేషన్ డిపోలను వదులుకోలేక.. డీలర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని వాపోతున్నారు.
డైలమాలో రేషన్ డీలర్లు :
రేషన్ సరుకులు పంపిణీ తిరిగి తమ చేతికి వచ్చినందుకు సంతోష పడాలో, బాధ పడాలో తెలియక రేషన్ డీలర్లు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం రేషన్ డిపోల ద్వారా బియ్యం, పంచదార మినహా మిగిలిన ఏ సరుకులు సరఫరా జరగడం లేదు.కిలోకి రూపాయి చొప్పున ప్రభుత్వం డీలర్‌కు కమీషన్ చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం ఇస్తున్న చాలీచాలని ఈ కమిషన్‌తో డీలర్లకు ఆర్థిక ఇబ్బందులు గటెక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒక రేషన్ డిపోకు 100 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయి అనుకుంటే ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ క్వింటాకు ఒక రూపాయి చొప్పున 100 క్వింటాళ్లకు పదివేల రూపాయలు, అదే విధంగా బియ్యం సంచులు, పంచదార అమ్మితే మరో రూ.4 వేలు ఆదాయం వస్తుంది. ఈ 14 వేల రూపాయలలో రేషన్ షాపు అద్దె, కరెంట్ బిల్లు, డీలర్ సహాయకుడికి జీతం కలిపి తక్కువలో తక్కువ ఏడు వేల రూపాయలు ఖర్చులను తీసివేస్తే కేవలం 7000 రూపాయలు మాత్రమే డీలర్‌కు మిగులుతుందన్నది వారి వాదన. ఏది ఏమైనా రేషన్ డీలర్ కు కనీస వేతనం దక్కే పరిస్థితి గత ప్రభుత్వంలోనూ లేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ లేదని, ఇటువంటి పరిస్థితుల్లో రేషన్ డీలర్ల జీవితాలు ఆగమ్య గోచరంగా మారుతున్నాయంటున్నారు. డీలర్లు ఏం చేయాలో పాలుపోక డైలమాలో పడ్డారని, ఎండియు వ్యవస్థ ఉంటే కనీసం సహాయకుడికి ఇచ్చే జీతం డబ్బులైన తమకు మిగిలేవి అంటూ డీలర్లు లబోదిబోమంటున్నారు. ఈనేపథ్యంలోనే కొంత మంది డీలర్ ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
గౌరవ వేతనం చెల్లించాలి : కనీస వేతన చట్టాన్ని రేషన్ డీలర్లకు వర్తింపజేయాలని
డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ డీలర్లకు కమీషన్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతన చట్టం ప్రకారం 25 వేల రూపాయలు డీలరకు గౌరవ వేతనంతో పాటు రేషన్ డిపో అద్దె, సహాయకుడికి జీతం, విద్యుత్ బిల్లుకు మరో 10 వేల రూపాయలు అదనంగా చెల్లించాలని డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.