A2Z सभी खबर सभी जिले की

సిరాజ్ కధ ఏమి చెబుతుంది???

 

తండ్రి ASI, అన్న కాన్స్టేబుల్, అక్క సాధారణ గృహిణి…. తమ్ముడు కరుడుగట్టిన తీవ్రవాది.. సినిమా కధ కాదు.. నిజంగా నిజం… అతని వయస్సు 29 సంవత్సరాలు.. చాలా సంవత్సరాలనుండి అతను తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నాడు.. బ్యాంకు లావాదేవీలు లక్షల్లో చూపుతున్నాయి… విదేశీ ప్రయాణాలు, ఖరీదైన కారుల్లో ప్రయాణాలు, బైకులు, డబల్ బెడఁరూమ్ అద్దె ఇల్లు, ఇవన్నీ ఎలా? అని అతని తండ్రి కానీ అన్న కానీ, అక్క కానీ ఒకసారి తన పైన నిఘా పెట్టి ఉంటే ఈరోజు అతని జీవితం ఇలా ఉండేది కాదు కదా! ఆ వీధిలో ఉన్నవాళ్లు అతని కదలికలు పైన ముందుగా మేల్కొని ఉంటే ఈరోజు అందరు ముకుమ్మడిగా జిల్లా SP గారికి ప్రాణ భయం తో మొరపెట్టుకోవాల్సినఅవసరం రాదు కదా! నిజం ఏమిటంటే అతను విజయనగరం లో నాలుగు చోట్ల మానవ బాంబులు పెట్టి పేల్చాలను కున్నాడు..

మనం అందరం మొన్న విన్నాము.. యుద్ధ సమయంలో ప్రతీ పౌరుడు ఒక సైనికుడే అని… అప్పుడు ప్రతీ వాళ్ళు తమ జబ్బలు తాము చరుచుకుని సైనికులు అయిపోయి తామే బోర్డర్ లో యుద్ధం చేసినంత ఫీల్ అయిపోయారు… ఆ మాట కి అసలు అర్ధం అది కాదు.. మీరు మీ చుట్టూ ఉన్నవారిని కొద్దిగా గమనించండి.. వాళ్ళ చేతలు, మాటలు, సోషల్ మీడియా పోస్టులు, అనుమానస్పద వ్యక్తుల కదలికలు గమనించగలరు.. అవసరం అయితే దగ్గర గా ఉన్న SHO గారికి చెప్పగలరు అని అర్థం…
యుద్ధం వచ్చేవరకు ఈదేశం ఏమైనా నాకు పరవాలేదు యుద్ధం వస్తే ఎవడో అక్కడ మనకోసం యుద్ధం చేసి చస్తాడు.. వాడి పని అదే కదా, అందుకోసం వాడు వెళ్ళాడు, జీతం తీసుకుంటున్నాడు అని అనుకుంటాం… వాట్సాప్ లో రెండు మూడు వీడియో లు అందరికంటే ముందుగా ఫార్వర్డ్ చేస్తాము… DP మార్చేస్తాము… పేస్ బుక్ పోస్ట్లు లైక్ చేసేస్తాము..
యుద్ధం బోర్డర్ లో జరిగితే అక్కడ మన కోసం ఎవడో చస్తాడు.. యుద్ధం మన పక్కన వున్నవాడు మొదలుపెడితే, మన వీధిలో వున్నవాడు గంజాయి కి, మద్యానికి, వ్యాసనాలకు, నడ మంత్రపు సిరి కి, జూదానికి బానిసగా మారి డబ్బులు కోసం తీవ్రవాదిగా మారితే???? నీ ఊరిలో బాంబు పేల్చితే?? నీ డ్యూటీ నువ్వు చేసావా??? మరి నీ నిర్లక్ష్యం కారణం గా ఇక్కడ ఎవడు బలి అవుతాడు??? ఇది నీ బాధ్యత కాదా??? మండలానికి అంటే దాదాపుగా ఒక లక్ష మందికి 15 మంది పోలీసుల పని అది అని కళ్ళు మూసుకుపోయి రాజకీయాలు చేయడం నీ పని…
మొదటి రోజు నచ్చిన హీరో సినిమా కోసం తన్నుకు చావడం నీ దేశభక్తి అంతేనా?? మీ ఇంటి ముందు ఎవరో ఈ దేశం జండా తో ర్యాలీ తీస్తే ఇంట్లో క్రికెట్ చూస్తున్న నువ్వు కనీసం వాళ్ళ వైపు చూడవు కదా… నీ ఊరులో, నీ వీధుల్లో జాతీయ జెండా పట్టుకుని తిరిగిన ఎక్ససర్వీస్ మెన్ అదే ఊరు హై స్కూల్ లోనో, ప్రైమరీ స్కూల్ లోనో ఆగస్టు 15, రిపబ్లిక్ డే రోజున అదే జెండా ఎగర వేసే అవకాశం ఇవ్వము కదా… అలా ఇస్తే అక్కడ ఉన్న పిల్లలకు దేశ భక్తి భావాలు కలుగుతాయి, మన త్రివిధ దళాళ్ళో చేరి మంచి పేరు తెచ్చుకోవాలి అని బాల్యం లో నాటుకు పోతుంది… కానీ మనం చాలా బిజీ.. అవి మనకు అవసరం లేదు కదా…. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఫీల్ అయిపోతారు రేపు మనకి ఇల్లు, పెన్షన్ ఇవ్వరు కదా…
మరి అమాయకులు బాంబు బ్లాస్టు, తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు అని బాధ పడటం లో అర్ధం లేదు.. అందరు ఈ పరిస్థితి కి కారణం.. మన చావుకి మనమే కారకులం… క్రికెట్ లో గెలిస్తే జాతీయ జెండా పట్టుకుని వీదుల్లో తిరిగేస్తే మనం దేశ భక్తులం అయిపోతాం.. కానీ అది జస్ట్ గేమ్.. ఈరోజు గెలుస్తారు రేపు ఓడుతారు.. కానీ యుద్ధం లో, తీవ్రవాదంలో దేశం ఓడితే జెండాలు పట్టుకుని నువ్వు నీ వీధిలో నీ ఊరులో నువ్వు తిరుగగలవా???
క్రికెట్ లో గెలిస్తే అది బెట్టింగ్ మాఫియా కి, advertise ఏజెన్సీ కి, ఆ క్రికెటర్ కి తప్ప సామాన్యుడు ఎలా లాభ పడతాడు?? దేశం ఎలా లాభ పడుతుంది??? ఒకవేళ అన్ని స్పోర్ట్స్, గేమ్స్ లో ఓడి క్రికెట్ లో మాత్రమే గెలిస్తే దేశం లాభ పడినట్లా???? క్రికెట్ లో బెట్టింగ్ జరుగుతుంది కదా.. మన అభిమాన క్రికెటర్ ఉన్న టీమ్ పైన బెట్టింగ్ కట్టి డబ్బులు పోగొట్టుకున్న సందర్భం ఉంది కానీ,, యుద్ధం పైన ఇంత వరకు బెట్టింగులు ఎందుకు జరుగలేదో చెప్పగలరా??? అది మన హీరోల అసలైన సత్తా… నీ దేశం ప్రతీసారి యుద్ధం లో గెలుస్తుంది అంటే అసలైన హీరోలు అక్కడ వున్నారు.. సినిమా ల్లో, క్రికెట్ లో, రాజకీయ పార్టీల్లో లేరు
బొలే త్రినాథ రావు

Related Articles

Back to top button
error: Content is protected !!