
విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తున్న బొకారో ఎక్సప్రెస్ కోమటిపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నిలిచిపోయింది. బ్రేక్ బైన్సింగ్ ఫెయిల్ కావడంతో మంటలు వస్తున్న వాసన వచ్చింది. దీంతో ప్రయాణికులు భయాందోళన చెంది కిందకు దిగిపోయారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి బ్రేక్ సరి చేశారు. రైలు కదలడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.