A2Z सभी खबर सभी जिले की

“హక్కుల సంరక్షణ సంఘం అధ్యక్షుడిగా సత్యనారాయణ”

భారత మానవ హక్కుల సంరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన గార సత్యనారాయణ నియమితులయ్యారు. మంగళవారం విజయనగరం రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.ప్రసాదరావు నియామక పత్రాన్ని అందజేశారు. సామాజికంగా, వ్యక్తిగతంగా పీడితుల తరఫున నిలబడి వారి హక్కులు కాపాడేందుకు కృషి చేస్తానని సత్యనారాయణ తెలిపారు.

Show More
Back to top button
error: Content is protected !!