A2Z सभी खबर सभी जिले की

“ఆయాల బకాయి జీతాలు చెల్లించాలి”

స్కూల్‌ ఆయాలు, శానిటేషన్‌ వర్కర్ల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకులు కోరారు. శుక్రవారం విజయనగరం కలెక్టరేట్‌ ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయాలకు, సానిటేషన్‌ వర్కర్లకు ప్రభుత్వం ఇస్తున్న అరకొర వేతనాలు కూడా ప్రతి నెలా చెల్లించడం లేదన్నారు. వేతనాలు సకాలంలో చెల్లించక పోవడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Show More
Back to top button