
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారాన్ని మహిళలు అందిపుచ్చుకొని స్వయం శక్తిగా ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు.
పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు స్వయం శక్తి సంఘాలకు రూ.1.5 కోట్ల చెక్కును అందజేశారు.
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అంతా పనిచేయాలన్నారు.