
వాట్సాప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డు సేవలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. 9552300009 నంబర్‌కు HI అని మెసేజ్ చేస్తే సేవను ఎంచుకోండి’ అనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి. అప్పుడు దీపం స్థితి, రైస్ డ్రా, eKYC, రైస్ కార్డు సమర్పణ, ఆధార్ సీడింగ్, కార్డు విభజన తదితర 8 సేవలు కనిపిస్తాయి. ఇవాళో, రేపో కొత్త రైస్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా రానుంది.
