
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను
రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి ,
జనసేన నేత గురాన అయ్యలు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ముందుగా పలు దేవాలయాల్లో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామనారాయణంలో శ్రీసూక్తం, ఆయుష్షు హోమాలు, పూర్ణాహుతి అనంతరం టీటీడీ వేద పాఠశాల వేద పండితులు, వేద విద్యార్థులచే వేద పారాయణం, ఆశీర్వచనం నిర్వహించారు. మహారాణి (ఘోపాసుపత్రిలో ) ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు ,స్వీట్స్ పంపిణీ చేశారు…బాబామెట్ట వెలుగు ఆశ్రమంలో వృద్దులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
పలు ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు… అనంతరం పలువురు రక్తదాన దానం చేశారు….అనంతరం పలు వార్డుల్లో జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ ని కట్ చేసి , స్వీట్స్ పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు… పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో బర్త్ డే కేక్ ని కట్ వేడుకలు నిర్వహించారు. సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా పాలవలస యశస్వి, గురాన అయ్యలు మాట్లాడుతూ
పవన్ కళ్యాణ్ ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే
పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవనకళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన డం ఆనందంగా ఉందన్నారు
2024 ఎన్నికల్లో
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ కలయికతో ఐదున్నర కోట్ల ఆంధ్రుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు
రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో జనసేన నేతలు, వీర మహిళలు , జన సైనికులు, మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.