
పట్టుదలతో కష్టపడి చదివితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చునని విజయానికి పేదరికం అడ్డు కాదని నిరూపించాడు గుర్ల తమ్మీరాజుపేట గ్రామానికి చెందిన చింతాడ రాంబాబు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన మెగా డీఎస్సీ ఫలితాలలో రాంబాబు ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం అనేకమందికి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలుగజేసింది. గుర్ల తమ్మి రాజుపేట గ్రామానికి చెందిన చింతాడ బుచ్చిబాబు రాంబాబు తండ్రి కూలి పనులు చేసుకుంటూ రోజువారి కూలితోనే కుటుంబాన్ని పోషిస్తూ తన కుమారుడి చదువుకు ఎటువంటి ఆటంకమూ కలుగకుండా ఉన్నత స్థానానికి చేర్చాలనె దృఢ సంకల్పంతో రాత్రులు పగలు కష్టపడి అనేక సమస్యలు ఎదుర్కొంటూ కుమారునికి అండగా నిలబడి నేడు కుమారుడు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించుకొనుటకు ముఖ్య కారకుడయ్యాడు. తండ్రి కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రాంబాబు చదువులో తన ప్రతిభను కనబరుస్తూ నేడు ఎస్ జి టి 69.5 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం గ్రామంలోని హర్షత్ రేకాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ చొక్కాకు పైడిరాజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు మాజీ వైస్ సర్పంచ్ చొక్కాకు సన్యాసి నాయుడు,పెద్దలు, గ్రామ యువతీ యువకులు రాంబాబు విజయం పై అభినందనలు వ్యక్తం చేశారు.