A2Z सभी खबर सभी जिले की

*79వ స్వాతంత్ర దినోత్సవం పర్వదినం పురస్కరించుకొని అంగ రంగ వైభవంగా ముస్తాబైన సిరిసహస్ర నిలయం*

*వందల సంఖ్యలో హాజరైన విద్యార్థినీ, విదార్థులు*

ఈ రోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త గౌ!! నీ!! శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె *చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* శుక్రవారం నాడు సిరి సహస్ర నిలయంలో చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులుతో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది త్యాగం ఫలితంగానే మనదేశానికి స్వాతంత్రo వచ్చిందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని అందువలన బాలలంతా భారత దేశ గొప్ప తనాన్ని తెలుసు కోవాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలలో మన దేశం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.మహనీయులు సాధించిన స్వాతంత్య్రం మనం స్పూర్తివంతంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె వందల సంఖ్యలో హాజరైన బాలలకు బుక్స్ కిట్స్ మరియు చాక్లెట్స్, బిస్కెట్స్ పంచి పెట్టారు.

ఈ సందర్భంగా పిల్లలు ఆమెకు అభినందనలు తెలిపారు.

Related Articles
Back to top button
error: Content is protected !!