A2Z सभी खबर सभी जिले की

రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి : *పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దయానంద్*

పారా జూనియర్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి పోటిల్లో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ అభినందించారు. ఆదివారం విజయనగరంలో గల సారధి వెల్ఫేర్ అసోసియేషన్ బ్లైండ్ స్కూల్ లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటిల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి 135 మంది పారా క్రీడాకారులు పాల్గొన్నారని, వీరిలో 47 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. పాతవారితో బాటు మొదటిసారి పోటిల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తి తో ఈనెల 9 న విశాఖపట్నంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలోనూ సత్తా చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని, అలాగే హర్యానా లో జరుగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమం లో సారధి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రదీప్, అమ్మ సేవా సంఘం వ్యవస్థాపకులు లక్కీ శేఖర్, మహేష్, కిరణ్ కుమార్, శర్మ, వెంకటరావు, పారా క్రీడాకారులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!