
(జె. ఎన్ టి యు జి వి) హాస్టల్లో సమస్యలతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఉన్నఫలంగా ఫీజులు బకాయి ఉన్నాయని చెప్పి హాస్టల్ నుండి కట్టు బట్టలతో తాళాలు వేసి బయటకు పంపించేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి మెయింటెనెన్స్ అని చెప్పి 7500 రూపాయలు ఒక విద్యార్థి దగ్గర్నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. హాస్టల్లో అప్లికేషన్ ఫామ్ కి పది రూపాయలు దగ్గరనుంచి వైఫై బిల్లు 200 రూపాయలు వరకు విద్యార్థులే చెల్లించాల్సి వస్తుంది. స్టడీ సర్టిఫికెట్ కోసం పర్మిషన్ల కోసం అని చెప్పి ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. మెస్ ఫీజులు కట్టడం లేదని పరీక్షలకు అనుమతించడంలేదు. విద్యార్థులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉన్నఫలంగా సివిల్ , మెట్లర్జీ బ్రాంచ్ విద్యార్థులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉన్నపలంగా సివిల్ మెట్లర్జీ బ్రాంచ్ కోర్సులుగా మార్చారు. దీనివలన విపరీతంగా ఫీజులు పెరిగి ఆ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద యూనివర్సిటీకి కనీసం చిన్న చిన్నచిన్న ప్రైవేట్ కాలేజీలకు వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ కూడా రావడం లేదు. పరిశోధనలకి పరికరాలు లేకపోవడం వలన ఏవైనా ప్రాజెక్టులు చేయాల్సి వచ్చినప్పుడు పక్క కాలేజీలకు పంపిస్తా ఉన్నారు. ప్రిన్సిపాల్ వచ్చి సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పడంతో ధర్నా విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి.రాము, జిల్లా సహయ కార్యదర్శి రమేష్, జగదీష్, చిన్నబాబు,రవి, పట్టణ అధ్యక్షులు సూరిబాబు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.