
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిది గా ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ విశిష్ట అతిథి గా పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం లో నూత అధ్యక్ష కారదర్శులు గా కాపుగంటి శ్రీనివాస్ బొడ్డు శ్రీనివాస్ లతోపాటు ట్రెజరర్ గా ప్రవీణ్ అంచాలియా తొమ్మిది మంది వైస్ ప్రెసిడెంట్స్ తొమ్మిది మంది జాయింట్ సెక్రటరీ లుగా పదవీ స్వీకరణ మహోత్సవం మెసానిక్ టెంపుల్ నందు వైభవం గా జరిగినది
ఈ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాపార సంస్థలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయని దానికి అనుగుణంగా ప్రభుత్వం MSME లను ఏర్పాటు చేస్తుంది అని తెలిపారు విజయనగరం జిల్లాలో మూడు MSME పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం ప్రతి రంగానికి అభివృద్ధి కి సహకరిస్తుంది అని తెలిపారు
ప్రముఖ వ్యాపారవేత్త కంకటాలమల్లిక్ మాట్లాడుతూ వ్యాపార సంస్థ లో కూడా యువత సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంది అని వ్యాపార సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణం గా మార్పులు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు నూతన అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాపారస్తుల మీద GST భారం ప్రాపర్టీ టాక్స్ భారం పడకుండా ప్రభుత్వం నుండి రక్షణ కల్పించాలని మంత్రిని కోరారు వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఛాంబర్ తరపున ముందుండి పరిష్కరించటానికి కొత్త కార్యవర్గం ఎల్లవేళలా ముందుంటుందని హామీ ఇచ్చారు ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ కాపుగంటి ప్రకాష్ గడచిన మూడు సంవత్సరాల్లో ఛాంబర్ చేసిన కార్యక్రమాలను వీడియో రూపం లో ప్రదర్శించారు విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గోవా లో ఉన్న కారణం గా ఛాంబర్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని ఛాంబర్ సభ్యులకు వీడియో రూపం లో మెసేజ్ తెలియజేశారు ఈ కార్యక్రమం లో రవ్వా శ్రీనివాస్ psc నాగేశ్వర రావు ఉసిరికాయ చంద్రశేఖర్ ప్రసాద్ జి శివ కుమార్ తదితరులు హాజరయ్యారు