
ఏపియస్ ఆర్టీసి (పిటిడి) ఉద్యోగులకు గత ఆరేళ్లుగా పెండింగు పెట్టిన పదోన్నతలకు ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆర్టీసి లో పనిచేస్తున్న క్లాస్ 4 ఉద్యోగు నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు పదోన్నతలు కోసం ఎదురుచూస్తున్న సుమారు 3500 మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని ఏపిపిటిడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయనగరం ఆర్టీసి ఇ.యు జిల్లా కార్యవర్గసమావేశం ఇ.యు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కె.కె.రావు అధ్యక్షతన జరిగింది.
ఈసమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గోన్న రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఆగస్టు 15 నుండి ప్రవేశపెట్టనున్న మహిళలకు ఫ్రీబస్సు స్కీమ్ సక్సస్ కావాలంటే వెంటనే 3000 వేల బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసిలో వివిధ కేటగిరులలో ఖాళీలు ఉన్న 10 వేలు ఉద్యోగాలు నియామాకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.
అలాగే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన 11 వ పిఆర్శి 24 నెలలు బకాయిలు,డిఏ బకాయిలు తో పాటు 12 వ పిఆర్సిని కమిషన్ ను ఏర్పాటు చేయాలని దామోదరరావు డిమాండ్ చేసారు.
ఈసమావేశంలో పాల్గోన్న మరో రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి పి.బానుమూర్తీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రస్తుతం ఇ.హెచ్.యస్ ద్వారా కనీస వైద్య సౌకర్యాలు కూడా అందడంలేదని. ఆర్టీసిలో పనిచేసే ఉద్యోగులు 24×7 పద్దతిలో పనిచేస్తారు
కాబట్టి విలీనానికి ముందు ఆర్టీసి ఉద్యోగులకు/రిటైర్డ్ ఉద్యోగులకు ఉన్న రిఫరల్ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు.