
ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ త్వరగా ప్రారంభించాలి. డ్యూయల్ మేజర్ విధానం అమలు చెయ్యాలని గ్రీవెన్స్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వి.చిన్నబాబు మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి నాలుగు నెలలు కావస్తున్న ఇప్పటివరకు కూడా ప్రభుత్వం డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ ప్రారంభించలేదు. ఒకవైపున ప్రైవేటు కాలేజీలో అనాధికారికంగా అడ్మిషన్లు చేసుకుంటూ క్లాసులు నడుపు కుంటున్నారు. దీనివలన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతున్న విద్యార్థులు నష్టపోతారు. అడ్మిషన్లు లేట్ అవడం వలన సెమిస్టర్ పరీక్షలు వెంటవెంటనే పెట్టాల్సి వస్తుంది. దీనితో విద్యార్థులు పరీక్షలపై ఆశక్తి చూపలేకపోతున్నారు. అదే విధంగా ప్రభుత్వం సింగిల్ మేజర్ పద్ధతి స్థానం లో డ్యూయల్ మేజర్ పద్ధతి తీసుకువస్తామని చెప్పి మల్లి సింగల్ మేజర్ విధానాన్ని అమలు చేస్తామంటున్నారు. దీనివలన విద్యార్దులు మైనర్ సబ్జెక్టు తీసిన దానిపై పీజీ చెయ్యడానికి అవకాశం ఉండడం లేదు. అంతే కాకుండా కొన్ని సబ్జెక్టులు కనుమరుగయ్యే ప్రమాదము ఉంది. కావున డ్యూయల్ మేజర్ విధానాన్ని అమలు చెయ్యాలి. ఈ డిమాండ్ లతో ఈ రోజు గ్రీవెన్స్ లో DRO శ్రీనివాస్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిస్కారం చేయకుంటే బుధవారం పెద్ద ఎత్తున కలక్టరేట్ ముట్టడిస్తామని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వ్. చిన్నబాబు టౌన్ కార్యదర్శి కే.రాజు పాల్గున్నారు.